News December 20, 2025

షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తాపేశ్వరం విద్యార్థుల జోరు

image

తాపేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఇంధన పొదుపుపై ఏపీ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీల్లో వీరు ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వాకాడ వెంకట రమణ నేతృత్వంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బహుమతులను అందుకున్నారు.

Similar News

News December 22, 2025

చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

News December 22, 2025

996 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

SBIలో 996 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో HYDలో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు ఉన్నాయి. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 22, 2025

KNR: మత్తు చిత్తులో యువత.. ‘EAGLE’ దూకుడెక్కడ..?

image

గంజాయి, డ్రగ్స్‌కు బానిసై యువత బతుకులు ఛిద్రం చేసుకుంటోంది. గల్లీలకూ ఈ కల్చర్ పాకడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా గంజాయి అక్రమ రవాణా ఆగట్లేదు. జిల్లాల్లో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్(EAGLE) మరింత ప్రభావవంతంగా పనిచేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025లో KNR కమిషనరేట్ పరిధిలో 27 కేసులు నమోదు కాగా రూ.9,89,025ల 39.561 KGల గంజాయిని పట్టుకున్నారు.