News February 18, 2026
షీలా నగర్: రన్నింగ్‌లో ఊడిన స్కూటీ చక్రం.. మహిళ మృతి

షీలా నగర్ టూ పోర్ట్ రోడ్డులో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్కూటీ టైరు ఊడిపోవడంతో కిందపడిన దాసరి ఇలామాజీ(35) తలకు తీవ్రగాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రహదారి మధ్యలో కానిస్టేబుల్ గంటా గౌరీనాయుడు ఆమెను బైక్ లిఫ్ట్ అడిగి ఎక్కాడు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 19, 2026
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది.
News February 19, 2026
శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
News February 19, 2026
ASF జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు: డీసీవో

సాంఘిక సంక్షేమ, జనరల్ గురుకులాల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 22న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,847 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు.


