News September 29, 2024
షూటింగ్ పోటీల్లో టెక్కలి విద్యార్థిని ప్రతిభ

సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని వజ్జ ప్రణవి ప్రతిభ కనబరిచింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సీబీఎస్ఈ అండర్-14 షూటింగ్ పోటీల్లో వెండి పథకం సాధించింది. ఎయిర్ రైఫిల్ లో 400 షూట్లకు గాను 391 పాయింట్లు సాధించింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు భోపాల్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
Similar News
News November 14, 2025
SKLM: ‘బాలలు చెడి వ్యసనాలకు బానిస కావద్దు’

బాలలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ఆడిటోరియంలో బాలలదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యను చక్కగా అభ్యసించి దేశానికి ఉపయోగపడే భావిపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత ఆశయాలతో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. DSP వివేకానంద, ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధికారులు ఉన్నారు.
News November 14, 2025
నౌకా నిర్మాణ హబ్‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్: CM

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.
News November 14, 2025
SKLM: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తాం

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తామని ఏపీ మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. NSFC కింద 450 రుణాలుకు 3 వేల దరఖాస్తులందయాని ఆమె వివరించారు. రూ 1.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని త్వరలో ఎంపిక చేసి రుణాలు ఇస్తామన్నారు. అధికారులు గడ్డమ్మ సుజాత పాల్గొన్నారు.


