News January 11, 2026

షూటింగ్ బాల్‌లో శ్రీ సత్యసాయి జిల్లాకు 3వ స్థానం

image

బాపట్లలో నేటితో ముగిసిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ జూనియర్ విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు జిల్లా సెక్రటరీ పూల ప్రసాద్ తెలిపారు. ఈ నెల 9న మొదలైన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి మొదటి సారి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు జిల్లా సెక్రటరీ లక్ష్మీనారాయణ అభినందించారు. జట్టుకు పీఈటీలుగా ఉమాదేవి, ప్రసన్నలక్ష్మి, అరవింద్ వ్యవహరించారు.

Similar News

News January 29, 2026

HYD: వీకెండ్‌లో బెస్ట్ డెస్టినేషన్‌.. జింకల పార్కు

image

తెలంగాణ పర్యాటక మణిహారంలో మరో మెరిసే రత్నం చేరబోతోంది. భాగ్యనగరవాసుల వీకెండ్ డెస్టినేషన్ శామీర్‌పేట జింకల పార్కును రూ.1.15 కోట్లతో సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వందకు పైగా చుక్కల జింకలు, రాజసం ఒలికించే కృష్ణజింకల గంతులతో ఈ అడవి పులకించనుంది. కాంక్రీట్ జంగిల్‌లో అలసిపోయిన మనసులకు ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాజెక్టు పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తుంది.

News January 29, 2026

‘కాళేశ్వరం’, ‘మిషన్ కాకతీయ’పై కేంద్రం ప్రశంసలు

image

TG: ఎకనామిక్ సర్వే-2026 నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలను ఈ సర్వే రిపోర్టు ప్రశంసించింది. KCR హయాంలోని ఈ రెండింటి వల్ల TGలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్లు పేర్కొంది. 1.31 కోట్ల ఎకరాల (2014) నుంచి 2.2 కోట్ల ఎకరాలకు (2023) పెరిగిందని తెలిపింది. 9 ఏళ్లలో సుమారు 90 లక్షల ఎకరాలకు ప్రభుత్వం కొత్తగా సాగునీరు అందించిందని వివరించింది.

News January 29, 2026

మేడారం జాతరలో నిజామాబాద్ సీపీ బందోబస్త్

image

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజులుగా మేడారం జాతరలో నిజమాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.