News January 5, 2026

సంక్రాంతికి థియేటర్ల కొరత!

image

సంక్రాంతికి రిలీజ్ కావడానికి సినిమాలు క్యూకట్టడంతో థియేటర్ల కొరత ఏర్పడనుందని టీటౌన్‌లో చర్చించుకుంటున్నారు. చిరంజీవి, ప్రభాస్ సినిమాలతో పాటు తమిళ మూవీలు పరాశక్తి, జన నాయకుడు బరిలో ఉన్నాయి. మన చిత్రాలకు TNలో ఆదరణ లేదని, అలాంటప్పుడు అక్కడి సినిమాలకు థియేటర్లు ఇస్తే తెలుగు చిత్రాలు నష్టపోతాయనే చర్చ జరుగుతోంది. సినీ పెద్దలు టాలీవుడ్ చిత్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనే టాక్ విన్పిస్తోంది.

Similar News

News January 5, 2026

రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్లు

image

దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో రూ.5 కోట్లతో తెరకెక్కిన మలయాళ మూవీ ‘ఎకో(eko)’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి 378% లాభాలతో మలయాళంలోనే 2025లో అత్యధిక ప్రాఫిట్ వచ్చిన చిత్రంగా నిలిచింది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్‌దేవ్, బియానా మోమిన్, వినీత్ కీలక పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో(తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది.

News January 5, 2026

BRS అతి తెలివితో తెలంగాణకు భారీ నష్టం: ఉత్తమ్

image

TG: పోలవరం-నల్లమల సాగర్‌ను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని GRMBకి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని ఈ నెల <<18768178>>12న<<>> కోర్టును కోరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందన్నారు. కృష్ణా-గోదావరి జలాల్లో BRS అతి తెలివితో తెలంగాణకు భారీ నష్టం చేసిందని విమర్శించారు.

News January 5, 2026

US వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

image

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ఒహియోలోని ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫైరింగ్ సమయంలో వాన్స్ ఇంట్లో లేరని అధికారులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.