News January 10, 2026
సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఈ నెల 19 వరకు మరిన్ని స్పెషల్ ట్రైన్‌లను నడపనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో HYD-సిర్పూర్ కాగజ్ నగర్(07473), ఈ నెల 10, 11 తేదీల్లో సిర్పూర్-HYD (07474), 11, 12, 12, 18, 19 తేదీల్లో HYD-విజయవాడ(07475), 10, 11, 12, 17, 19 తేదీల్లో విజయవాడ-HYD(07476) మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.
Similar News
News February 22, 2026
లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా: అంబటి

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న CM చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కమిటీ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిందని, అయినా దానిపై వక్రభాష్యాలు ఎందుకని నిలదీశారు. ప్రజలకు వాస్తవమేంటో తెలుసని చెప్పారు.
News February 22, 2026
తీవ్ర విషాదం.. పెళ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఒకే రోజు ఇద్దరు కూతుళ్ల పెళ్లి వైభవంగా చేసి సంతోషించాలనుకున్న తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. శనివారం వివాహం జరగాల్సి ఉండగా ముందు రోజు రాత్రి అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగారు. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు బాడీలను ఫ్యామిలీకి అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News February 22, 2026
రాత్రి పూట తలస్నానం చేయకూడదా?

చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయం విశ్రాంతికి సంకేతం. అప్పుడు చన్నీటి స్నానంతో శరీరాన్ని అధికంగా చల్లబరిస్తే అనారోగ్యాలు వస్తాయని వద్దంటారు పండితులు. డాక్టర్లు సైతం ఇది మంచిది కాదంటున్నారు. ‘రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు. దానివల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. అయినా తలస్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. తల ఆరడానికి సమయం పడుతుంది. దీంతో తలనొప్పి, సైనస్ రావొచ్చు’ అంటున్నారు.


