News January 12, 2026
సంక్రాంతికి మరో 3 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి ద.మ.రైల్వే అనకాపల్లి-చర్లపల్లి మధ్య అదనంగా మరో 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అనకాపల్లిలో 18న ఒక ట్రైన్(07479), 19న ఒక ట్రైన్(07478) రాత్రి 10.30 గం.కు బయలుదేరి తర్వాతి రోజు ఉ.11.30గం.కు చర్లపల్లి చేరుకుంటుంది. 19న చర్లపల్లి(07477)లో అర్ధరాత్రి 12.40 గం.కు బయలుదేరి అదే రోజు రా.9 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, GNT, VJA, రాజమండ్రి మీదుగా నడుస్తాయి.
Similar News
News February 20, 2026
ఇన్‌స్టాలో ఫొటో చూసి.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు

TG: గృహహింస కేసు, బాధతో తల్లి మరణం, లుకౌట్ నోటీస్, మరో వివాహం చేసుకుందన్న కోపంతో గర్భిణి అయిన మాజీ భార్యను కడతేర్చాడా కర్కోటకుడు. మహేశ్-సునీత 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత అతడు కెనడా వెళ్లగా గొడవలై భర్త, అత్తమామలపై ఆమె గృహహింస కేసు పెట్టారు. ఇన్‌స్టాలో ఫొటో చూసి మరొకరిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్నాడు. మరో ఫొటోతో HYD వనస్థలిపురంలోని ఆమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చి కిరాతకంగా హత్య చేశాడు.
News February 20, 2026
రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్‌వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


