News January 11, 2026

సంక్రాంతికి స్టాలిన్ కానుక.. రూ.3వేలు, చీర, ధోతి, బియ్యం, చక్కెర

image

తమిళనాడు ప్రజలకు స్టాలిన్ ప్రభుత్వం రూ.6,936 కోట్లతో సంక్రాంతి కానుకలు అందిస్తోంది. రేషన్ కార్డు ఉన్న 2.22 కోట్ల కుటుంబాలకు రూ.3వేలతో పాటు కేజీ బియ్యం, కేజీ చక్కెర, చెరకు గడ, చీర, ధోతి ఉచితంగా పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీ లేకుండా ముందే ఇంటింటికీ టోకెన్లు అందించారు. దాంట్లో ఉన్న తేదీ ప్రకారం జనవరి 12 వరకు దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. కాగా ఏపీ, టీజీలో ఇలాంటి స్కీమ్ లేదు.

Similar News

News February 19, 2026

పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

image

సాధారణంగానే పిల్లలు కుదురుగా ఉండరు. అదేకాకుండా ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. పిల్లలు చదివేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. అటెన్షన్ బ్రేక్‌లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారుచేసి ఫాలో అవ్వాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.

News February 19, 2026

విశాఖలో AI హబ్: సుందర్ పిచాయ్

image

ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో గూగుల్ AI హబ్‌లను ఏర్పాటు చేస్తోందని కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. మానవాళికి AI చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ AIని చాలా వేగంగా అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీని అందరికీ చేర్చడమే మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

News February 19, 2026

163 ఏళ్ల తర్వాత ఇలా.. మళ్లీ 2189లోనే!

image

ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల పండుగలు ఒకే సమయంలో రావడం చాలా అరుదు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్, క్రైస్తవ మతంలో ఈస్టర్ పండుగకు ముందు వచ్చే లెంట్, చైనీస్ ‘లూనార్ న్యూఇయర్’లు 1863లో 24 గంటల వ్యవధిలోనే ప్రారంభమయ్యాయి. మళ్లీ 163 ఏళ్ల తర్వాత 2026లో ఈనెల 17-18న ఇది ఆవిష్కృతమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మళ్లీ ఇలాంటి వింతను చూడాలంటే 2189 వరకు వేచి చూడాలి.