News January 14, 2026
‘సంక్రాంతి’ అంటే ఏంటో మీకు తెలుసా?

సంక్రాంతి అంటే సూర్యుడు ఓ రాశి నుంచి మరొక రాశిలోకి మారడం. ఇది ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర అంటే కదలిక. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుందని, గ్రహాల గమనం వల్లే సృష్టి నడుస్తుందని దీనర్థం. సంస్కృతంలో ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే మార్పు. సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతున్నా, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రాంతి’ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఈ మార్పు అభ్యుదయానికి సంకేతం.
Similar News
News February 14, 2026
ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్‌లో లొకేషన్ వివరాలతో అప్‌లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్‌కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
News February 14, 2026
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

తూర్పు గోదావరి జిల్లాలో 6 కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హత కలిగి, వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, కోర్ట్ అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in/
News February 14, 2026
ఆయిల్ పామ్ తోటల్లో ఈ అంతర పంటలతో మేలు

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.


