News January 11, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ట్రైన్ నంబర్ 07477/07478 చర్లపల్లి నుంచి అనకాపల్లికి, తిరుగు ప్రయాణంలో అనకాపల్లి నుంచి చర్లపల్లికి నడవనున్నాయి. ఈ రైళ్లు గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ట్రైన్ నంబర్ 07479 అనకాపల్లి నుంచి చర్లపల్లికి మరుసటి రోజు అందుబాటులో ఉంటుందని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 18, 2026
పోచంపల్లి: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

మద్యపానం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. పోచంపల్లి మండలం జూలూరులో పద్మ అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆంజనేయులు మద్యం తాగి రావడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపంతో గురైన పద్మ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వీరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News February 18, 2026
NZB: అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ప్రథమ పౌరులు..!

NZB మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.
News February 18, 2026
తిరుపతి: ఉచితంగా వృత్తి శిక్షణ కార్యక్రమం

నేషనల్ అకాడమీ కన్ స్ట్రక్షన్ (NAC) తిరుపతిలో PMKVY ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సేఫ్టీ సూపర్వైజర్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పాసై, 18- 45 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 20 తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.


