News January 15, 2026
సంక్రాంతి.. కోళ్లను ఇలా గుర్తించండి

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చరిత్రలో కోడి పందేలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈకల రంగు, కాళ్ల రంగు, కళ్ల రంగును బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
#డేగ: ఎరుపు రంగు ఈకలు కలిగినవి.
#కాకి: నలుపు రంగు ఈకలు కలిగినవి.
#నెమలి: పచ్చని రంగు ఛాయ కలిగినవి.
#పర్ల: తెలుపు రంగు ఈకల మీద నల్లటి మచ్చలు ఉన్నవి.
#అబ్రాస్: ఎరుపు, తెలుపు, నలుపు కలిసిన మిశ్రమ రంగు.
#సేతు: పూర్తిగా తెల్లగా ఉండే కోడి.
Similar News
News February 21, 2026
GNT: సీఎం రాక.. భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ

గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఆదివారం తపాలాశాఖ ఆధ్వర్యంలో డాక్ సేవక్ సమ్మేళనం జరగనుంది. CM చంద్రబాబుతో పాటూ కేంద్రమంత్రి సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 21, 2026
PGRS ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి: GNT ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జనవరి నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పైసత్వరమే చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించితప్పించుకొనితిరుగుతున్న నేరస్థులను గుర్తించాలన్నారు.
News February 21, 2026
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: SP

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరీక్షలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో యజామాన్యాలు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు విద్యార్థులు తేవద్దన్నారు.


