News January 26, 2025

సంక్రాంతి తర్వాత టీచర్లే రాలేదు: రాళ్లగడ్డ సర్పంచ్

image

గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రాళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాలను సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి తెరవలేదని సర్పంచ్, విద్యా కమిటీ ఛైర్మన్ కేలేబు కుమారి ఆరోపించారు. విద్యార్థులను దారిలో పెట్టాల్సిన టీచర్లే స్కూల్‌కు డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఫలితంగా ఆదివాసీ బిడ్డలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 9, 2025

నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

image

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్‌పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.

రిజల్ట్ తెలిసే KCR ప్రచారం చేయలేదు: రేవంత్

image

జూబ్లీహిల్స్‌లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని KTR చేసిన విమర్శలపై రేవంత్ స్పందించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టే జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇతర చోట్ల ఉపఎన్నికలు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశానన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపుపై KCRకు నమ్మకం లేదన్నారు. అందుకే సునీతను గెలిపించాలని కనీసం ప్రకటనైనా విడుదల చేయలేదని కౌంటర్ వేశారు.