News March 1, 2026
సంక్రాంతి తర్వాత డల్ టాలీవుడ్ డల్

సంక్రాంతికి కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీసు ఆ తర్వాత డల్ అయింది. పండగ తర్వాత రిలీజైన తెలుగు సినిమాలు ఆ రేంజ్ ఆదరణ దక్కించుకోలేకపోయాయి. గత నెలరోజుల్లో రిలీజైన 10 సినిమాల్లో ఏ ఒక్కటీ మంచి కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. పెద్ద సినిమాలు లేకపోవడం, టికెట్ ధరలు, ఓటీటీలకు ఆడియన్స్ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఈనెల, ఏప్రిల్‌లో బడా సినిమాల రిలీజ్‌తో పరిస్థితి మారే అవకాశం ఉంది.
Similar News
News March 1, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆదివారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.4,000 ఎగబాకి రూ.1,58,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి రూ.3,25,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News March 1, 2026
ఖమేనీ హతం.. పాలన ఎవరి చేతుల్లో అంటే?

ఇరాన్‌లో కొత్త నాయకుడిని నిర్ణయించే వరకు లీడర్‌షిప్ కౌన్సిల్ పాలన చూసుకుంటుందని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆ కౌన్సిల్‌లో ప్రెసిడెంట్, న్యాయాధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఓ జ్యూరీ సభ్యుడు ఉంటారని తెలిపింది. సుప్రీం లీడర్ బాధ్యతలు ఈ కౌన్సిల్ తాత్కాలికంగా చూసుకుంటుందని పేర్కొంది. కాగా తదుపరి లీడర్ ఎవరో తనకు తెలుసని, కానీ ఇప్పుడే పేరు బయటపెట్టనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
News March 1, 2026
హీరో విజయ్‌కు మరో షాక్..

తమిళ స్టార్ హీరో విజయ్‌కు వ్యక్తిగత జీవితంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. తన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన వేళ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓ నటితో విజయ్‌కు అఫైర్ ఉందని తన తల్లి చేసిన ఆరోపణల్లో వాస్తవాలున్నాయని, అందుకే అన్‌ఫాలో చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా భార్య చేసిన ఆరోపణలపై విజయ్ ఇప్పటివరకూ స్పందించలేదు.


