News December 29, 2024

సంక్రాంతి పండుగ.. హోటల్స్‌కు ఫుల్ డిమాండ్

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప.గో జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్‌ల అద్దెలు కొండెక్కాయి. భీమవరం, ఏలూరు, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 4 రోజులకు గాను రూ.25 వేల- రూ.35 వేల వరకు అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.

Similar News

News January 1, 2025

భీమవరం: అత్యాచారానికి యత్నం.. వృద్ధుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించిన వృద్ధుడికి భీమవరం పోక్సో కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించినట్లు భీమవరం రూరల్ SI వీర్రాజు తెలిపారు. భీమవరం మండలానికి చెందిన ఆరేళ్ల బాలికను నరసింహరాజు అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన బాలిక అమ్మమ్మ కిటికి తలుపులో నుంచి చూడగా బాలికతో వృద్దుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News January 1, 2025

పాలకోడేరు: కేజీ మటన్ కొంటే కేజీ చికెన్ ఫ్రీ

image

కొత్త సంవత్సరం వేళ ఓ మాంసం వ్యాపారి భలే ఆఫర్ తీసుకొచ్చారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో కేజీ మటన్ కొంటే.. కేజీ చికెన్ ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టారు. దీంతో మాంసం ప్రియులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అలాగే కేజీ చికెన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే కేక్, బిర్యానీ కొన్న వారికి కూల్ డ్రింక్‌నూ ఉచితంగా అందించారు.

News January 1, 2025

ప.గో: రైతుల ఖాతాల్లో రూ 911కోట్లు జమ- కలెక్టర్  

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆరునెలల ప్రగతి తెలిపారు. రైతులకు వారు తోలిన ధాన్యానికి రూ.911కోట్లు వారి ఖాతాలకు తోలిన రెండు రోజుల్లో వేశామన్నారు. అన్నం పెట్టే రైతుకు అందరూ అండగా ఉండాలన్నారు. అలాగే ఎన్ ఆర్ జీ ఎస్ ఉపాధి హామీ పథకంలో రోడ్ల నిర్మాణం, రెవెన్యూ సదస్సులో 511గ్రామాలనుంచి అర్జీలు అందాయన్నారు.