News February 11, 2026

సంక్రాంతి బరిలో మరో హీరో?

image

చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ వచ్చే సంక్రాంతికి అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ‘ఆయ్’ ఫేమ్ అంజి డైరెక్షన్‌లో మూవీని ఓకే చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్‌తోనే పండుగ వైబ్ వచ్చేలా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే పేరును లాక్ చేసినట్లు చర్చించుకుంటున్నాయి. అటు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌తో పాటు శర్వానంద్, తేజా సజ్జ మూవీలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని టీటౌన్ వర్గాల మాట.

Similar News

News February 16, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 16, 2026

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.

News February 16, 2026

మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

image

☛ పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి. ☛ పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.