News December 30, 2025
సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు కీలక రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం-తిరుపతి, విశాఖ-బెంగళూరు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ వంటి 9 జతల రైళ్లకు జనవరి 1 నుండి వివిధ తేదీల్లో అదనపు ఏసీ, స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు 3rd AC కోచ్‌ను కూడా చేర్చారు.
Similar News
News February 20, 2026
విశాఖ: వైసీపీ MPTC అరెస్ట్

గంజాయి తరలిస్తూ చెక్ పోస్ట్‌ను ఢీకొట్టి పరారైన కేసులో భీమిలి మండలం దాకమర్రి వైసీపీ ఎంపీటీసీ కే.నగేశ్ బాబును కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేతకు ఈయన అనుచరుడని సమాచారం. నిందితుడిపై గతంలోనే జగ్గంపేట పీఎస్‌లో కేసు నమోదైంది. గంజాయి స్మగ్లింగ్‌లో అరెస్టవ్వడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
News February 20, 2026
జనతా వారధిలో వినతులు స్వీకరించిన పీవీఎన్ మాధవ్

బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం (విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News February 20, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 ఫిర్యాదులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకారరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 20 వినతులు అందాయి. పట్టణ ప్రణాళికా విభాగంపై వచ్చే ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అత్యధికంగా నార్త్ జోన్ నుంచి 6 వినతులు రాగా.. అధికారులు వెంటనే స్పందించి వీటిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.


