News January 13, 2025

సంక్రాంతి రైతన్న జీవితాల్లో వెలుగులు నింపాలి: కేసీఆర్

image

రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి అని మాజీ సీఎం KCR అన్నారు. ‘X’ వేదికగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన వల్లనే తెలంగాణలో వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాగుకు, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి రైతన్నల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

Similar News

News October 30, 2025

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఐఈవో

image

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) మాధవి ఆదేశించారు. బుధవారం ఆమె జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన మాధవి, విద్యార్థులతో మాట్లాడి సబ్జెక్టుల వివరాలు అడిగారు. ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు శ్రద్ధ చూపాలని దిశానిర్దేశం చేశారు.

News October 30, 2025

నూతన క్వారీలకు అనుమతి తప్పనిసరి: మెదక్ కలెక్టర్

image

మెదక్ జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్, నూతన క్వారీల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ(సీయా) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లా సర్వే నివేదికను రూపొందించినట్లు తెలిపారు.

News October 29, 2025

మెదక్: అమరుడికి నివాళులర్పించిన అదనపు ఎస్పీ

image

మెదక్ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్న అమరుడు ఆబేద్ హుస్సేన్ కుటుంబాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఈరోజు పరామర్శించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పై బాంబు దాడిలో మృతిచెందిన ఆబేద్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మహేందర్ హామీ ఇచ్చారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్ పాల్గొన్నారు.