News January 10, 2026

సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్ గుర్తుంచుకోండి!

image

AP: సంక్రాంతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచినట్లు ఫిర్యాదులు రావడంతో రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై ఫిర్యాదుకు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు(92816 07001)ను సంప్రదించాలంది. 18వ తేదీ వరకు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొంది.

Similar News

News February 4, 2026

SHOCKING: బాలిక నోట్లో పేలిన చాక్లెట్

image

చాక్లెట్ అనుకొని పేలుడు పదార్థం తినడంతో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. రాజస్థాన్‌లోని అల్వార్(D)కి చెందిన మూడేళ్ల అక్షు తన సోదరితో కలిసి FEB 2న స్థానిక దుకాణంలో చాక్లెట్ కొనుక్కుంది. దాన్ని నోటిలో పెట్టుకుని నమలగానే పేలి బాలిక నోరు, దవడ చీలిపోయింది. ఈ మేరకు బాలిక అత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపు ఓనర్ గన్ పౌడర్ నింపిన పదార్థాన్ని ఇచ్చాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది.

News February 4, 2026

సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు: KTR

image

TG: సీఎం రేవంత్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన ఆరోపణలు చేశారు. ‘KLSR అనేది సీఎం రేవంత్ బినామీ కంపెనీ. రేవంత్ వాడుతున్న కారు కూడా ఈ సంస్థ పేరు మీదే ఉంది. 2018లోనే ఈ కంపెనీపై IT దాడులు జరిగాయి. 2023లో దివాళా తీసింది. వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకూ డబ్బులు లేవు. అలాంటి కంపెనీకి రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నోటీసులూ ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

News February 4, 2026

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హతగల వారు FEB 16వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. సైట్: eastgodavari.dcourts.gov.in