News January 10, 2026
సంక్రాంతి వేళ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ

సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వాహనాలతో అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో రద్దీ పెరుగుతుందని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ తెలిపారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సరిహద్దు పోలీస్ స్టేషన్ల వద్ద భద్రత పెంచామన్నారు. ప్రయాణికులు సంయమనం పాటించాలని కోరారు. అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News January 11, 2026
తాడికొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

తాడికొండ (మ) లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్(17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. తుళ్లూరు నుంచి ఐదుగురు యువకులు తాడికొండ YCP ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
News January 11, 2026
రేపు మదనపల్లిలో స్పందన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు సోమవారం మదనపల్లిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక DSP కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ సమస్యలకు సంబంధించిన అర్జీతో మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు సూచించారు.
News January 11, 2026
మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తాం: ఇరాన్

దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పదేపదే <<18824047>>బెదిరిస్తుండటంపై<<>> ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘అమెరికా మాపై అటాక్స్ చేస్తే ఈ రీజియన్‌లో ప్రతి US బేస్‌ను, ఇజ్రాయెల్‌ను లక్ష్యాలుగా చేసుకుంటాం’ అని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ బాకెర్ కాలిబాఫ్ హెచ్చరించారు. తాము నలువైపుల నుంచి శత్రువులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ‘అమెరికా నాశనమవ్వాలి’ అంటూ పార్లమెంటులో సభ్యులు నినాదాలు చేశారు.


