News January 15, 2026

సంక్రాంతి వేళ HYDలో DANGER

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.

Similar News

News January 17, 2026

లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త: సీపీ సజ్జనార్

image

సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని ఫైరయ్యారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News January 17, 2026

హైదరాబాద్ మెట్రో ఇక సర్కారు సొంతం!

image

HYD మెట్రోలో కొత్త అధ్యాయం మొదలైంది. L&T కున్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వం స్వీకరిస్తూ, మరో ₹2,000 కోట్లను వాటా కింద చెల్లించి ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. దీంతో మెట్రో నిర్వహణ, టికెట్ ధరలు, విస్తరణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కనుంది. ఈ ప్రక్రియను మార్చి 2026 నాటికి పూర్తి చేసి మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News January 17, 2026

గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎంట్రీ!

image

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నేడు పర్యాటక శాఖ నిర్వహించే ‘డ్రోన్ షో’కు సర్వం సిద్ధమైంది. ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే స్లాట్లన్నీ నిండిపోయినందున, రిజిస్ట్రేషన్ లేని వారు స్టేడియం వద్దకు రావొద్దని కోరారు. ఆ విన్యాసాలను మిస్ కాకుండా ఉండటానికి పర్యాటక శాఖ అందించే లైవ్ లింక్ ద్వారా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.