News January 15, 2026
సంక్రాంతి వేళ HYDలో DANGER

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.
Similar News
News March 4, 2026
TDP Vs YCP.. మండలిలో రసాభాస

AP: తిరుమల లడ్డూపై చర్చ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సంబంధం లేని అంశాలు చర్చకు తెచ్చి డైవర్ట్ చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై తమ MLC చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగాన్ని TDP అడ్డుకుందంటూ YCP ఆందోళనకు దిగింది. అధికార పక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామంది. దీంతో వాకౌట్ చేసి వెళ్లిపోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
News March 4, 2026
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 199 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షకు 199 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO వినోద్ బాబు తెలిపారు తెలిపారు. మొత్తం 9,796 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 9,597 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేదన్నారు.
News March 4, 2026
రోబోటిక్ ఫైర్ ఫైటింగ్ పరికరాల సమీకరణ: హోంమంత్రి అనిత

అగ్నిమాపక సేవా సవరణ చట్టంలో భాగంగా రోబోటిక్ ఫైర్ ఫైటింగ్ పరికరాలను సమీకరిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టిన సవరణ చట్టాన్ని సభ ఆమోదించింది. సిబ్బంది ఆధునిక రక్షణ పద్ధతులపై శిక్షణ ఇస్తామన్నారు. అగ్నిమాపక భద్రత వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ఫైర్ ఆడిట్ క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవిస్తే భవన యజమానులపై చర్యలు తప్పవన్నారు.


