News December 23, 2025
సంక్రాంతి సంబరాలు విజయవంతం చేయండి: కలెక్టర్

ఆత్రేయపురంలో జనవరి 11 నుంచి 13 వరకు కాటన్ ట్రోఫీ సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు జరపాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కొరత ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంబరాల నిర్వహణపై గ్రామస్థులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
జనవరి 1 నుంచి భీమాశంకర్ టెంపుల్ క్లోజ్

జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్ ఆలయం(MH) 2026 JAN 1 నుంచి మూతపడనుంది. ఆలయ అభివృద్ధి ప్లాన్‌లో భాగంగా ప్రధాన ఆలయ సభా మండపాన్ని రెనోవేట్ చేయనున్నారు. నిర్మాణ పనులు జరిగే టైంలో భక్తుల సేఫ్టీ దృష్ట్యా ఆలయంలో దర్శనాలను 3 నెలలపాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఈ టెంపుల్ ఆధ్యాత్మిక ప్రేమికులకు మాత్రమే కాదు నేచర్ లవర్స్, ట్రెక్కింగ్ చేసే వారికీ ఫేవరెట్ స్పాట్‌గా ఉంది.
News December 23, 2025
అప్పు చేసి మరీ ఎంజాయ్ చేస్తున్న మన కుర్రకారు.. మరి చైనాలో?

భారత యువత అవసరం కోసమో, ఆస్తుల కోసమో కాకుండా.. ఎంజాయ్ చేయడానికే అప్పులు చేస్తున్నారట. ఈ ఏడాదిలో మన కుర్రకారు తీసుకున్న పర్సనల్ లోన్లలో 27% టూర్ల కోసమేనని తేలినట్లు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా తెలిపారు. మరోవైపు చైనా యువత మాత్రం బంగారం కొంటూ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనవాళ్లేమో రేపటి సంపాదనపై ధీమాతో నేడు అప్పు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు.
News December 23, 2025
ఒక మహిళ ఆస్తి ఆమె తదనంతరం ఎవరెవరికి చెందుతుంది?

మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం-1956 అమల్లో ఉంది. సెక్షన్-14 ప్రకారం, భార్య కష్టార్జిత ఆస్తి ఆమె తదనంతరం ఆమె భర్తకు, పిల్లలకు చెందుతుంది. పిల్లలు లేకపోతే పూర్తిగా ఆమె భర్తకే చెందుతుంది. * క్రైస్తవుల్లో భార్య మరణిస్తే భారతీయ వారసత్వపు చట్టం-1925, సెక్షన్ 35 ప్రకారం, 1/3 వంతు ఆస్తి ఆమె భర్తకు చెందుతుంది. మిగిలినది పిల్లలకు చెందుతుంది. పిల్లలు లేకపోతే సగం భర్తకు, మిగిలినది ఆమె బంధువులకు చెందుతుంది.


