News December 26, 2025
సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

AP: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో సంక్రాంతి సెలవులకు ముందు ఫార్మెటివ్ అసెస్మెంటు-3 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. JAN 5 నుంచి 8వరకు 1-5 తరగతులకు ఉ.9.30-10.45 గంటల మధ్య, మ.1.15-2.30 గంటల మధ్య పరీక్షలుంటాయి. 6-10 తరగతుల వారికీ ఉదయం, మధ్యాహ్నం రెండేసి సెషన్లు టెస్ట్ నిర్వహిస్తారు. సిలబస్, మోడల్ పేపర్లతో SCERT సర్క్యులర్ జారీచేసింది. 8న పరీక్షలు ముగియనుండగా 10నుంచి సంక్రాంతి సెలవులు మొదలవుతాయి.
Similar News
News January 1, 2026
టెంపో డ్రైవర్ టు శంఖ్ ఎయిర్‌లైన్స్ ఓనర్..

UP కాన్పూర్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ నేడు శంఖ్ ఎయిర్‌లైన్స్‌కు ఓనర్ అయ్యారు. టెంపో నడుపుతూ చిన్న వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రవణ్.. 2014లో సిమెంట్ ట్రేడింగ్‌లో సక్సెస్ కావడంతో మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లోకి దిగారు. భారత్‌లో ప్రారంభం కానున్న 4 కొత్త ఎయిర్‌లైన్స్‌లో శంఖ్ ఒకటి. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నారు శ్రవణ్.
News January 1, 2026
KCRను కసబ్‌తో పోలుస్తావా? రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

TG: కేసీఆర్, హరీశ్ రావుకు ఉరేసినా తప్పులేదని సీఎం రేవంత్ <<18735382>>వ్యాఖ్యానించడంపై<<>> హరీశ్ రావు ఫైరయ్యారు. ‘తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్‌తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. సభకు వస్తే KCRను అవమానించబోమని చెబుతూనే కసబ్‌తో పోల్చుతావా?’ అని మండిపడ్డారు. రేవంత్‌కు బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియదన్న విషయం ఈరోజు వెల్లడైందని పేర్కొన్నారు.
News January 1, 2026
‘సిటీ ఆఫ్ హనీ’ అని దేనిని పిలుస్తారో తెలుసా?

సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో తేనె ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ను ‘సిటీ ఆఫ్ హనీ’ అని పిలుస్తారు. ఇండో-నేపాల్ బార్డర్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పండ్ల తోటలు, పూల వనాలతో తేనెటీగల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన తేనెను యూరప్, గల్ఫ్, సౌత్ ఈస్ట్ ఏషియాకు ఎగుమతి చేస్తారు. దేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా మహారాజ్‌గంజ్ నుంచే సప్లై అవుతుంది.


