News January 7, 2026

సంక్రాంతి-2026 విన్నర్ ఎవరో?

image

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద, చిన్న హీరోలందరూ పొంగల్ బరిలో నిలిచారు. ప్రభాస్ ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘MSVG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ విన్నర్‌గా నిలిచింది. మీరు ఏ మూవీకి వెళ్తారు? COMMENT

Similar News

News February 9, 2026

ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం

image

T20WCలో ఐర్లాండ్‌పై శ్రీలంక 20 రన్స్ తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన ఐర్లాండ్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. టెక్టర్(40), అడైర్(34), లార్కన్(21) మాత్రమే రాణించారు. ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కొంతసేపు ఐర్లాండ్ డామినేషన్ కనిపించినా ఆఖరికి ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ చెరో 3, పతిరాణా 2, వెల్లలాగే, చమీర చెరో వికెట్ తీశారు.

News February 9, 2026

Jr.NTR న్యూ లుక్.. ఫ్యాన్స్ హ్యాపీ

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR నటిస్తున్న సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ జోర్డాన్‌లో జరగనుంది. ఇందుకోసం ఈరోజు ఎన్టీఆర్ HYD నుంచి జోర్డాన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో తీసిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. కొన్ని నెలల క్రితం తారక్ సన్నబడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ తాజా లుక్‌ చూసి ఖుషీ అవుతున్నారు. ఆయన బర్త్‌డే సందర్భంగా మే 20న గ్లింప్స్ లేదా టీజర్ రిలీజయ్యే ఛాన్సుంది.

News February 9, 2026

టీ20ల్లో చెత్త రికార్డ్

image

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ శనక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇవాళ T20 WCలో ఐర్లాండ్‌పై డకౌటైన ఆయన టీ20ల్లో అత్యధిక(16) సార్లు సున్నాకే ఔటైన ప్లేయర్‌గా నిలిచారు. నేడు ఎదుర్కొన్న తొలి బంతినే షార్ట్ థర్డ్ మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. టీ20Iల్లో ఇతని తర్వాత రువాండ జట్టుకు చెందిన జప్పీ(15), ఐర్లాండ్ కెప్టెన్ స్టెర్లింగ్(14) డకౌట్ అయిన లిస్టులో ఉన్నారు.