News January 26, 2025

సంక్షేమ పథకాలను ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డి

image

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 సంక్షేమ పథకాలను మండలంలోని గాంధీనగర్‌లో వేం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మార్కెట్ ఛైర్మన్ సంజీవరెడ్డి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబీస్ టీకాలు

image

AP: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇవి అందించనున్నారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలను సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.

News July 5, 2025

రాజమండ్రిలో మహిళ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

image

రాజమండ్రికి చెందిన మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. 2013 డిసెంబర్ 2న లక్ష్మీవారపు పేటకు చెందిన నాగభారతిని మహేశ్‌, లక్ష్మణరావు, మరో వ్యక్తి బంగారం కోసం హత్య చేశారు. మహిళ భర్త ప్రసాదరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాదనలు విన్న పదో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు కమ్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఉమశునంద ముగ్గురు హత్య చేశారని నిర్ధారించి శుక్రవారం తీర్పు చెప్పారు.

News July 5, 2025

సర్పంచి ఎన్నికలు అప్పుడేనా?

image

TG: BC రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఆయనతో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్లపై చర్చించారు. కులగణనపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. BCలకు 42% సీట్లు ఇచ్చి, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం.