News March 16, 2025
సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్ల విలువ గల పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను డిజిటల్ విధానంలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన వాటిలో 100 పడకల ఆసుపత్రి, స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు పలు కాలువలు, బంజారా భవన్, మహిళ శక్తి బస్సులు లాంటి సంక్షేమ పతకాలున్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు.
Similar News
News November 7, 2025
ఈ పొజిషన్‌లో నిద్రపోతున్నారా?

నిద్రపోయే సమయంలో పడుకునే పొజిషన్ చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడుచుకుని లేదా బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బోర్లా పడుకుంటే మెడ కండరాలపై, నడుముపై ఒత్తిడి పడుతుందని పేర్కొంటున్నారు. ఇక మోకాళ్లను ముడుచుకుని ఒక వైపుకు పడుకోవడం వల్ల దీర్ఘకాలిక వెన్ను నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపుకు తిరిగి పడుకోవాలంటున్నారు.
News November 7, 2025
జనగామ: కార్మిక రాజ్యమే శ్రామికుల జీవితాల్లో మార్పు తెస్తుంది: రమ

కార్మిక రాజ్యమే శ్రామికుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ అన్నారు. జనగామలో శుక్రవారం జరిగిన సీఐటీయూ జిల్లా 4వ సభలో పాల్గొని వారు మాట్లాడారు. కార్మికులందరూ.. ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దోపిడీ కార్పొరేట్ శక్తుల వల్ల కార్మికులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాపర్తి రాజు, బి.మధు, పి.శ్రీకాంత్, యాటల సోమన్న తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
GDK పట్టణంలో స్కౌట్& గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం

గోదావరిఖని RCOA క్లబ్ సమీపంలోని బైడన్ పావెల్ పార్క్ వద్ద భారత్ స్కౌట్& గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అధికార ప్రతినిధి ముప్పిడి రవీందర్ రెడ్డి పాల్గొని జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో స్కౌట్స్& గైడ్స్ ఎనలేని సేవ చేస్తుందని కొనియాడారు. మాస్టర్ బుచ్చయ్య, దేవేందర్, కుమార్, స్వర్ణలత, లక్ష్మీ కుమారి, రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.


