News May 17, 2024

సంగం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సంగం మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడు మర్రిపాడు మండలం, ఇర్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 2, 2025

నెల్లూరులో మంత్రుల ఫొటోలు మాయం

image

నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేటలోని శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. కార్తీక పౌర్ణమికి భక్తులను ఆహ్వానిస్తూ ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు పెట్టారు. సిటీ ఎమ్మెల్యే, మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ధర్మకర్తల మండలి సభ్యుల ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో మంత్రుల ఫొటోలు లేకపోవడం విమర్శలకు దారి తీసింది.

News November 2, 2025

పసికందును బాలల శిశు గృహా కేంద్రానికి తరలింపు.!

image

కోవూరు ఆర్టీసీ సమీపంలో ముళ్లపొదల్లో లభ్యమైన పసికందును పోలీసులు స్వాధీనం చేసుకుని ఆసుపత్రి తరలించిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న కోవూరు ICDS CDPO శారద సంబంధిత విషయాన్ని జిల్లా ICDS PDకి సమాచారం అందించారు. దీంతో ఆమె హాస్పిటల్‌కి చేరుకొని ఆ పసికందును నెల్లూరు GGHలోని న్యూ బోరన్ బేబి కేర్ యూనిట్‌కు తరలించారు. పరీక్షల అనంతరం శిశు గృహానికి తరలించనున్నారు.

News November 1, 2025

నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్

image

నెల్లూరు లేడీ డాన్ అరుణకు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు సూర్యారావుపేట Ps లో ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను విజయవాడ పోలీసులు శుక్రవారం పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా కోర్టు 14 రోజుల రిమాండ్ వేయడంతో తిరిగి కేంద్ర కారాగారానికి తరలించారు.