News December 19, 2025

సంగారెడ్డి:ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ నెల 22, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు,29,30 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలకు సూచించారు.

Similar News

News December 21, 2025

పేదరిక రహిత జిల్లాగా ఎన్టీఆర్: MP చిన్ని

image

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాంబర్ ఆఫ్ రియల్టర్స్&బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి విశిష్ట సేవ పురస్కారాలు-2025 కార్యక్రమంలో MP కేశినేని చిన్ని, MLA గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖులకు విశిష్ట సేవ పురస్కారాలు అందజేశారు. NTR జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు P-4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

News December 21, 2025

రాజమండ్రి: జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో నమోదు

image

జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని DMHO డాక్టర్ కె. వెంకటేశ్వర రావు తెలిపారు. మొత్తం 1,89,550 మంది చిన్నారులకు గానూ 1,85,759 మందికి చుక్కలు వేయడం ద్వారా 98 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వివరించారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

News December 21, 2025

KCR మారతారని ఆశించా కానీ..: CM రేవంత్

image

TG: రెండేళ్ల తర్వాత కేసీఆర్ కలుగులో నుంచి బయటకు వచ్చారని CM రేవంత్ అన్నారు. JAN 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, కేసీఆర్ రావాలని ఆహ్వానించారు. ఓటమితో కేసీఆర్ మారతారని ఆశించా కానీ మళ్లీ అబద్ధాలే చెప్పారని వ్యాఖ్యానించారు. ఆయనకు అధికారం పట్ల ఉన్న వ్యామోహం ప్రజల పట్ల లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే జలదోపిడీ జరిగిందని మీడియాతో చిట్‌చాట్‌లో ఆరోపించారు.