News March 12, 2025

సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు ఈనెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

Similar News

News December 31, 2025

మెదక్: 9 చెరువుల నుంచి నీరు విడుదలకు నిర్ణయం: కలెక్టర్

image

రబీ 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 500 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న 9 చెరువుల నుంచి పంటలకు నీరు విడుదలకై చర్చించి నిర్ణయించినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. పెద్ద చెరువు కొంటూరు, హైదర్ చెరువు నార్లాపూర్, రాయరావు చెరువు నర్సాపూర్, దేవతల చెరువు వెల్దుర్తి, హల్దీ వాగు ప్రాజెక్టు హకీంపేట్, పెద్ద చెరువు అంబాజీపేట ఉన్నాయి.

News December 31, 2025

వరంగల్: 2025 NEW YEAR వేడుకలు.. ముందస్తు నిఘా సక్సెస్!

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో గతేడాది NEW YEAR వేడుకల సందర్భంగా పోలీసుల ముందస్తూ చర్యలతో 2025లో జీరో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కొత్త సంవత్సర వేడుకల వేళ ముఖ్యంగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు గతేడాది రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు జరిపారు. అడుగడుగునా బారికేడ్లను ఏర్పాటు చేసి, వాహనాల వేగాన్ని నియంత్రించారు. రోడ్డు ప్రమాదాలను పోలీసులు నివారించగలిగారు.

News December 31, 2025

ATP: హెడ్ కానిస్టేబుల్‌పై సైకో దాడి..!

image

గుంతకల్లులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బుధవారం ఓ సైకో హల్‌చల్ చేశాడు. స్థానిక పెట్రోలు బంకు వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఫక్రుద్దీన్‌పై అతను కర్రతో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోపక్క రోడ్డుమీద వెళ్తున్న పాదచారులపై అతను దాడికి యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.