News September 5, 2025

సంగారెడ్డిలో గురుపూజోత్సవం ప్రారంభం

image

సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం గురుపూజోత్సవం వేడుకలను ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను మార్గదర్శకులుగా తీర్చిదిద్దేది ఉపాద్యాయులు మాత్రమే అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News September 7, 2025

దేశ ప్రయోజనాల కోసం ఓటేయండి: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

image

ఎంపీలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికను కేవలం ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికగా చూడొద్దని కోరారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాశారు. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం ఓటేయాలని కోరారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

News September 7, 2025

దెందులూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సీతంపేట వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అతని శరీరం ముక్కలైపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. మృతుడు ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ప్రమాదంలో సెల్‌ఫోన్ కూడా ధ్వంసమైంది. మృతుని వివరాలు తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 7, 2025

బుగ్గారం: మంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

image

బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.