News April 15, 2025

సంగారెడ్డిలో గృహిణి అదృశ్యం.. కేసు నమోదు

image

గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. పుల్కల్ మండలం బస్వాపూర్‌కు చెందిన సరళ (30) భర్తతో గొడవపడి ఈనెల 11న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 22, 2026

రాజమండ్రి: కలెక్టర్ ప్రకటన.. రేపు యథావిధిగా..

image

తూ.గో. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయం నుంచి హాజరావుతారని వెల్లడించారు.

News February 22, 2026

ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపాలిటీ కార్యాలయాలలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.

News February 22, 2026

BELలో మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులు

image

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)2 మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేయనుంది. CMA/CA(ఇంటర్మీడియట్) అర్హతగల వారు మార్చి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మొదటి ఏడాది నెలకు స్టైపెండ్ రూ.25K, రెండో ఏడాది రూ.27K, మూడో ఏడాది రూ.30K చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in