News November 29, 2025

సంగారెడ్డిలో ప్రజావాణి రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య శనివారం పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని, ఈ మార్పును ప్రజలు గమనించాలని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

Similar News

News December 1, 2025

HYD: ‘ఓన్లీ ప్రాఫిట్‌ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం

image

స్టాక్‌ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్‌ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్‌ తెలిపింది.

News December 1, 2025

పిన్నెల్లి సోదరుల కేసుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

image

పల్నాడు జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో నమోదైన 161 వాంగ్మూలాలు నేరుగా నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి చేతికి చేరడంతో సంచలనం రేగింది. ఈ పత్రాలను సుప్రీం కోర్టులో సమర్పించడంతో ధర్మాసనం తీవ్రంగా మండిపడి, ఇవెలా లీకయ్యాయో ప్రశ్నించింది. ముందస్తు బెయిల్‌ను తిప్పికొట్టి, ఇద్దరూ రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. రికార్డుల లీకేజీపై ఉన్నతాధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

News December 1, 2025

డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

image

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.