News February 28, 2025
సంగారెడ్డిలో మహిళ హత్య..UPDATE

సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్‌లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 17, 2025
కోదాడ: బీసీల బంద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాస ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింతాబాబు మాదిగ శుక్రవారం కోదాడలో ఈ విషయాన్ని వెల్లడించారు. మాదిగలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News October 17, 2025
ఏలూరు: శానిటేషన్‌పై అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

జిల్లాలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని శానిటేషన్‌పై కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా శానిటేషన్ ప్రగతిని సమీక్షిస్తూ, పనితీరులో లోటు ఉన్న మండల అధికారులపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా శానిటేషన్‌ను మెరుగుపరచాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 17, 2025
కాకినాడ: మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం సమీక్ష

ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.