News March 17, 2025
సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య

యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ కథనం మేరకు.. హవేలీ ఘనపూర్ నుంచి సంగారెడ్డికి వలస వచ్చిన మన్నే వినోద్ (21) కొంతకాలంగా శివాజీ, మరియమ్మ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 15న తన ఇంట్లో హత్య చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
ఫేక్ పాస్‌పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!

సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్‌పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్‌లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
News March 17, 2025
చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టండి: రేవంత్

TG: చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టాలని CM రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డికి లేఖ రాస్తామని చెప్పారు. టర్మినల్‌కు ఆయన పేరు పెట్టి దేశభక్తి చాటుకోవాలని కోరారు. బల్కంపేటలోని ప్రకృతి వైద్య చికిత్స ఆలయానికి రోశయ్య పేరు పెడతామన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
News March 17, 2025
HYD: KTRతో తీన్మార్ మల్లన్న భేటీ.. మీ కామెంట్?

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరిగింది. తీన్మార్ మల్లన్న సోమవారం KTR, హరీశ్ రావుతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని BRS నేతలను కోరారు. అయితే, వీరి భేటీపై సోషల్ మీడియాలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో BRSపై తీవ్ర విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్న.. KTRను కలవడం చర్చనీయాంశమైంది. దీనిపై మీ కామెంట్?