News February 18, 2025
సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

సంగారెడ్డి జిల్లాలో ఓ <<15474129>>యువకుడు<<>> దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News March 13, 2025
మగ, ఆడపిల్లలను సమానంగా చూడాలి: ఎస్పీ ఉదయ్

తల్లిదండ్రులు మన ఇంట్లోనుంచే మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులు మగ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను ఆడపిల్లలకు ఇస్తూ మంచి విద్యను అందించాలన్నారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమన్నారు. మహిళలు ఈ రోజుల్లో తాము ఎందులోనూ తక్కువ కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
News March 13, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.
News March 13, 2025
మెదక్‌లో మహిళలు మిస్..

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.