News November 15, 2024
సంగారెడ్డిలో లగచర్ల రైతులను కలవనున్న KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నేడు సంగారెడ్డికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, రైతులను పరామర్శించనున్నారు. వికారాబాద్ జిల్లా అధికారులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన వారిని సంగారెడ్డి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Similar News
News September 15, 2025
మెదక్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ బాలికల హై స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు ఈ పరీక్షలు 6 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
News September 15, 2025
మెదక్: ప్రజా పాలన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్

ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారు. మెదక్లో జరిగే కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 15, 2025
మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్గా కృష్ణమూర్తి బాధ్యతలు

మెదక్ జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ఇన్స్పెక్టర్గా ఎం. కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు బాధ్యతలుగా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.