News August 29, 2025
సంగారెడ్డిలో హెల్ప్‌లైన్ నంబరం 08455- 276155

సంగారెడ్డి కలెక్టరేట్‌లో అత్యవసర సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణ సహాయం కోసం అత్యవసర నంబర్ 08455 – 276155 ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఫోన్ చేయవచ్చని, అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపడతారని కలెక్టర్ సూచించారు.
Similar News
News August 29, 2025
విశాఖకు గూగుల్.. 25వేల మందికి ఉపాధి!

AP: గూగుల్ <<17545438>>విశాఖలో<<>> నెలకొల్పే డేటా సెంటర్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు అంచనా. ఆ సంస్థ సుమారు రూ.50వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ కూలింగ్ కోసం అత్యధిక నీరు అవసరం పడుతుంది. అందుకే సముద్ర తీరం ఉన్న విశాఖను కంపెనీ ఎంచుకుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న డేటా సెంటర్ నుంచి సముద్ర మార్గంలో వైజాగ్‌కు కేబుల్స్ తీసుకురావడం కూడా సులువవుతుంది.
News August 29, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లోనూ పాఠశాలలకు హాలిడే ఇవ్వాలనే వినతులు వినిపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని IMD సూచించింది.
News August 29, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు 30నుంచి వైద్య పరీక్షలు: ఎస్పీ

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 30నుంచి వైద్య పరీక్షలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ అశోక్ కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 30న రిజిస్టర్ నంబర్ 4001160 నుంచి 4155879 వరకు, సెప్టెంబర్ 1న నంబర్ 4156636 నుంచి 4299199 వరకు, సెప్టెంబర్ 2న నం: 4299250 నుంచి 4504602 వరకు సివిల్, అదేరోజు నం: 4002777 నుంచి 4468576 అభ్యర్థులు హాజరవ్వాలని సూచించారు.