News January 14, 2026

సంగారెడ్డి: అంగన్‌వాడీలకు విద్యుదీకరణ, మరమ్మతులు

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, మరమ్మతులపై కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలకు తక్షణమే కనెక్షన్లు ఇవ్వాలని, భవనాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు విద్యుత్, సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

Similar News

News February 13, 2026

ఎవరీ కందుల జాహ్నవి?

image

సియాటెల్ యంత్రాంగం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించడంతో <<19125504>>కందుల జాహ్నవి<<>> మరోసారి వార్తల్లో నిలిచారు. 2023లో అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని మృతిచెందిన జాహ్నవిది కర్నూలు(D) కౌతాళం మం. కుంభళనూరు క్యాంప్‌ గ్రామం. శ్రీకాంత్‌, విజయలక్ష్మిల కుమార్తె జాహ్నవి ఆదోనిలో డిగ్రీ వరకు చదివారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పోలీసు వాహనం ఢీకొని మృతిచెందారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు 3ఏళ్లు న్యాయపోరాటం సాగించి గెలిచారు.

News February 13, 2026

HYD: యువతి హత్య.. ఇన్‌ఫార్మర్ అతడే!

image

మొయినాబాద్‌లో ఆస్తికోసం అన్న, చెల్లి(న్యాయవాది)ని కిరాతకంగా చంపిన కేసులో పోలీసులు కీలక విషయాలు సేకరించారు. ఈ కేసులో శేఖర్ అనే వ్యక్తి స్వప్న అన్న రాజుకు ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ కేతిరెడ్డిపల్లి నుంచి సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారంతో రాజు, సందీప్, వీరేశ్, శివలింగం ఆమెను కిరాతకంగా హతమార్చారు. ముందు పొంతనలేని సమాధానం చెప్పినా తర్వాత నిజం ఒప్పుకున్నారు. గురువారం ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు.

News February 13, 2026

విశాఖలో సహజీవనం.. రాజమండ్రి వాసిని చంపిన ప్రియురాలు

image

విశాఖ(D) ఆనందపురం శివారులో రాజమండ్రికి చెందిన వ్యక్తి బుధవారం హత్యకు గురైన <<19117246>>విషయం తెలిసిందే<<>>. నాగశివ(36)తో సహజీవనం చేస్తున్న శ్రావణి(41) హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆవు విక్రయ డబ్బుల విషయంలో గొడవ, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో అతడిపై కత్తితో దాడి చేయగా మృతి చెందాడు. జాగిలాల సాయంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. నిందితురాలికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.