News August 13, 2025
సంగారెడ్డి: అత్యవసరం అయితే ఫోన్ చేయండి: ఎస్పీ

రాబోయే 72 గంటలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. అత్యవసరం అయితే 100, 87126 56739 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ఫోన్ చేస్తే వెంటనే సహాయక చర్యలు చేపడతారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.
Similar News
News August 13, 2025
డోర్నకల్ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

డోర్నకల్ మీదుగా నడిచే పలు రైళ్లను ట్రాక్ మరమ్మతులు, మెయింటినెన్స్ కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో DKJ-VIJ (67767), VIJ-DKJ (67768), VIJ-SEC (12713), VIJ-BCM(67215), GUNTOR-SEC(12705), SEC-GUNTR(12706) రైళ్లు ఉన్నాయి. ఈనెల 14 నుంచి 5 రోజుల పాటు రద్దు వర్తిస్తుందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
News August 13, 2025
రూ. 56 లక్షల ఆస్తులు అటాచ్ చేశాం: SP

ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన గంజాయి కేసులు అరెస్ట్ అయిన ఒడిశా వాసి నగేశ్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. గంజాయి వ్యాపారంతో సంపాదించిన స్థిర, చరాస్తులను గుర్తించామని, రూ.56 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోల్‌కత్తా అథారిటీ పరిధిలో ఉన్నాయని, ఎవరు కొనుగోలు చేసినా చెల్లవన్నారు.
News August 13, 2025
కాసిపేట: అప్పుల బాధకు లారీ డ్రైవర్ ఆత్మహత్య

కాసిపేట మండలం సోమగూడెంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ MD.రంజాన్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని SI ఆంజనేయులు తెలిపారు. లారీ నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్న రంజాన్ కొత్త లారీ కొని అప్పుల పాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలో ప్రమాదం జరిగింది. కుటుంబీకులతో చెప్పి బాధపడుతూ మానసికంగా కుంగిపోయి ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.