News December 8, 2025
సంగారెడ్డి: అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ టీచర్ భార్య మృతి

కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్న సుచిత ఆదివారం అనుమానస్పదంగా మృతి చెందింది. ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్ తన భార్య గుండెపోటుతో మరణించిందని బంధువులను నమ్మించాడు. మాధ్వార్‌లో అంత్యక్రియల సమయంలో గొంతు వద్ద మరకలు చూసి సుచిత బంధువులు అంత్యక్రియలు నిలిపివేశారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Similar News
News December 10, 2025
రాష్ట్రంలో పరువు హత్య!

TG: హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో పరువు హత్య కలకలం రేపింది. బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అది ఇష్టం లేని యువతి పేరెంట్స్ అతడిని నిన్న హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అనంతరం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వారే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 10, 2025
ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికల సమాచారం

జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మూడు మండలాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్పంచ్ స్థానాలు: 39
అభ్యర్థులు: 139
వార్డు స్థానాలు: 287
అభ్యర్థులు: 532
ఓటర్ల సంఖ్య: 68,303
పోలింగ్ కేంద్రాలు: 379
ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
పీవోలు(పోలింగ్ అధికారులు): 525 మంది
ఉప పీవోలు: 652 మంది
News December 10, 2025
గన్నవరం: ‘పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం’

ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై
గన్నవరం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విమానాల రద్దు, ప్రణాళికలు దెబ్బతిన్న నేపథ్యంలో, పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి విమానాశ్రయ అధికారులు అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేశామని బుధవారం తెలిపారు.


