News January 7, 2026
సంగారెడ్డి: అల్పాహారం నిధులు విడుదల

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల వేళ అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని సంగారెడ్డి డీఈఓ తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించాలని, ఇందుకోసం జిల్లాకు రూ. 26,14,590 మంజూరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News February 13, 2026
పిచ్చి తుగ్లక్‌లు చాలా మంది ఉంటారు: KTR

TG: <<19122392>>నేనే రాజు నేనే మంత్రి<<>> అనుకున్న చాలా మంది గాలికి కొట్టుకుపోయారని, ఎవరూ శాశ్వతం కాదని KTR విమర్శించారు. పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారని ఎద్దేవా చేశారు. ‘ఇందిర, NTR, KCR లాంటి నాయకులే ఓడిపోయారు. రేవంత్ రెడ్డిలా విర్రవీగిన వాళ్లు వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యం అలానే ఉంది’ అని తెలిపారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని CPIతో కలిసి గెలుచుకున్నామని, కొత్తగూడెంలో ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు.
News February 13, 2026
1,782 మంది సిబ్బందితో బందోబస్తు: నంద్యాల ఎస్పీ

శ్రీశైలం క్షేత్రంలో 1,782 మంది సిబ్బందితో బ్రహ్మోత్సవాల ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. నంద్యాలలో ఏఎస్పీ, డీఎస్పీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఎస్పీలు 11 మంది, డీఎస్పీలు 24, సీఐలు 78, ఎస్సైలు 132, ఏఎస్ఐ-హెచ్‌సీలు 303, పీసీలు 568, ఉమెన్ పీసీలు 88, హోంగార్డులు 386, ఉమెన్ హోంగార్డ్స్ 30 మందితో పాటు ఏఆర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
News February 13, 2026
పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.


