News January 3, 2026
సంగారెడ్డి: ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. 2025-26 సంవత్సరానికి 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించుకోగా, 1,225 ఎకరాలు పూర్తయిందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.
Similar News
News February 15, 2026
నెల్లూరు: లేడీస్.. బీ అలర్ట్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బంగారం ధర తులం రూ.1.60 లక్షలు దాటడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత 6నెలల్లోనే 60కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా నంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి నగలు, తాలిబొట్లు లాకెళ్తున్నారు. తాజాగా గూడూరులో ఓ టీచర్‌పై బంగారం కోసం దాడి చేయడం కలకలం రేపింది. నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
News February 15, 2026
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్‌గా మూడ్ గణేష్..!

కొత్తగూడెం మేయర్ అభ్యర్థిగా సుజాతనగర్ 20వ డివిజన్ కార్పొరేటర్ మూడ్ గణేష్ పేరును సీపీఐ అధిష్ఠానం ఖరారు చేసింది. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా మేయర్ పీఠాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడత అవకాశం సీపీఐకి దక్కింది. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న ఆయన అభ్యర్థిత్వానికే పార్టీ మొగ్గు చూపింది. త్వరలోనే ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 15, 2026
టమాటాలో కాయ తొలుచు పురుగును ఎలా నివారించాలి?

టమాటాను కాయ తొలుచు పురుగు ఆశించి తొలుత లేత ఆకులు, కొమ్మలను తిని తర్వాత కాయలను తొలిచి నాశనం చేస్తుంది. ఈ పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ ఎర పంటగా బంతి మొక్కలను నాటాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. నాటిన 28, 35 రోజులకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ 0.3ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువైతే లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ML లేదా స్పైనోసాడ్ 0.4ML కలిపి పిచికారీ చేయాలి.


