News October 12, 2025
సంగారెడ్డి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ మేళా

కంది మండలం ఎద్దుమైలారం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 2025-26కు సంబంధించి అర్హులైన ఐటీఐ అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో 304 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 17న జిల్లా కేంద్రంలోని ఐటీఐ సెంటర్‌లో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లా పరిసర ప్రాంతాల విద్యార్థులు తమ సర్టిఫికేట్స్‌తో హజరై ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ డైరెక్టర్ అలోక్ ప్రసాద్ తెలిపారు.
Similar News
News October 12, 2025
జంతువులకు కూడా జ్యోతిషం వర్తిస్తుందా?

జ్యోతిషం అంటే భవిష్యత్తును చెప్పే శాస్త్రమే కాదు. కర్మ సిద్ధాంతాన్ని వివరించే దివ్య దర్శనం కూడా! ఈ శాస్త్రం జరగబోయే కష్టసుఖాలను తెలుపుతుంది. జీవులు ఏ రూపంలో ఉన్నా పాపపుణ్యాల మిశ్రమ ఫలితాలను పసిగట్టగలిగే శక్తి దీనికి ఉంది. అండజం(గుడ్డు నుంచి), పిండజం(గర్భం నుంచి), ఉద్భిజం(భూమి నుంచి) వంటి ఏ రూపంలో జన్మించినా, పుట్టుక నుంచి మరణం వరకు అనుభవించే కాలాన్ని, ఫలితాలను ముందే చెప్పగలదు. <<-se>>#Jyothisham<<>>
News October 12, 2025
CERSAIలో భారీ జీతంతో ఉద్యోగాలు

సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్& సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా(CERSAI) 11పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BCA, MCA, B.Tech, MBA, PGDM, M.TECH, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. మేనేజర్‌కు ₹40వేలు నుంచి ₹1.40లక్షల వరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు ₹70వేల- ₹2లక్షల వరకు జీతం చెల్లిస్తారు.
News October 12, 2025
నేడు విశాఖలో డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన

AP: మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సిఫీ AI డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ IT కంపెనీ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థే ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్. ఇది రూ.1500 కోట్లతో రెండు దశల్లో 50 మెగావాట్ల AI ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.