News February 10, 2025

సంగారెడ్డి: ఇంజినీరింగ్ విద్యార్థి మిస్సింగ్

image

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి అదృష్టమైన ఘటన సంగారెడ్డిలోని బ్రాహ్మణవాడలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై రమేష్ కథనం ప్రకారం.. బ్రాహ్మణ వరకు చెందిన వాణిశ్రీ కుమారుడు రిషిక్ రెడ్డి(22) నర్సాపూర్ శివారులోని BVRITలో చదువుతున్నాడు. కళాశాలలో ప్రాజెక్టు వరకు సబ్మిట్ చేయాలని చెప్పి ఈనెల 8 ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News July 7, 2025

కాకినాడ JNTUకు కొత్త అధికారులు

image

కాకినాడ జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ రెక్టార్, రిజిస్ట్రార్‌లను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. యూసీఈకే ఈఈఈ విభాగంలో పనిచేస్తున్న శ్రీవినాసరావు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సుబ్బారావు ఇన్‌ఛార్జ్ రెక్టార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వారిని వీసీ ప్రసాద్ అభినందించారు.

News July 7, 2025

ఉమ్మడి నల్గొండలో డీసీసీ పదవులకు తీవ్ర పోటీ.!

image

ఉమ్మడి NLG జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా జిల్లాలో DCC అధ్యక్ష పదవులపై ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో DCC కీలకం కానుండటంతో పదవుల కోసం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నేతలు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎంపికలు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

News July 7, 2025

MNCL: 45 లక్షల మొక్కలు నాటేందుకు సింగరేణి సిద్ధం

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఅండ్ఎండీ బలరాం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ ప్రదేశాల్లో కనీసం మూడు మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే 14 వేల హెక్టార్లలో ఏడు కోట్లకు పైగా మొక్కలను నాటిందని పేర్కొన్నారు.