News March 4, 2026

సంగారెడ్డి: ‘ఇంటర్నల్ మార్కులను నమోదు చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంటర్నల్ మార్కులను రేపటిలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 9, 2026

భూపాలపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ ఏర్పాటు: కలెక్టర్ పరిశీలన

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో MRI సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రిని సందర్శించి, ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు కేటాయించిన గదులు, మౌలిక వసతులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సౌకర్యంతో పేద రోగులకు వ్యయప్రయాసలు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.

News March 9, 2026

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీందర్, ఏసీపీలు, డీఈలు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

News March 9, 2026

చిరంజీవి రాంగ్ టైమ్‌లో పార్టీ పెట్టారు: శివాజీ

image

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్‌లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.