News February 28, 2025
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సంగారెడ్డి జిల్లాలో మార్చి 3 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.
News December 14, 2025
హన్మకొండ: 19.57% శాతం పోలింగ్ @9AM

జిల్లాలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. 9 గంటల సమయానికి జిల్లా మొత్తం మీద 19.57% పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వేలేరులో అత్యధికంగా 22.55% పోలింగ్ నమోదు కాగా, ధర్మసాగర్‌లో 21.18% ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఐనవోలులో 18.52%, హసన్‌పర్తిలో 17.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 14, 2025
కాకినాడ: సంక్రాంతికి 41 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో అధిక భాగం ఉమ్మడి తూ.గో మీదుగానే ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ నుంచి లింగంపల్లి స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసమే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.


