News March 5, 2025

సంగారెడ్డి: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి గోవిందురాం పాల్గొన్నారు.

Similar News

News March 6, 2025

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడండి: కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉండే హ్యాండ్ పంపులను అవసరమైతే మరమ్మతులు చేయించాలన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు, డామేజీలు ఉంటే వెంటనే సరి చేయాలన్నారు.

News March 6, 2025

మెదక్: మెదటి రోజు 6410 మంది హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల, టీజీఆర్ఎస్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా 6,410 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 6,180 మంది పరీక్షకు హాజరయ్యారు. 230 వివిధ కారణాల వల్ల పరీక్షకు హాజరుకాలేదన్నారు.

News March 6, 2025

కామారెడ్డిలో ఫ్లెక్సీ షాపులు బంద్

image

మార్చ్‌ 8, 9వ తేదీల్లో కామారెడ్డిలో ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు ఫ్లెక్సీ షాప్ అసోసియేషన్ యజమానులు తెలిపారు. ఫ్లెక్సీ కలర్స్ మెటీరియల్స్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో నిరసిస్తూ.. నూతన ధరలను పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 8, 9 రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ పాటిస్తున్నట్లు యజమానులు తెలిపారు.

error: Content is protected !!