News January 11, 2026
సంగారెడ్డి: ఈనెల 12న ప్రజావాణి రద్దు: కలెక్టర్

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఈనెల 12న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, ఇతర ముఖ్యమైన కార్యకలాపాలలో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారని, ఈ సందర్భంగా ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
Similar News
News February 20, 2026
అబద్ధాలు ట్రెండ్ కావచ్చు.. కానీ గెలిచేది నిజమే: లోకేశ్

AP: <<19166821>>హెరిటేజ్ ఫుడ్స్<<>> విషయంలో నిజం గెలిచిందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘హెరిటేజ్ సంస్థపై సాక్షి మీడియా చేసింది తప్పుడు ప్రచారమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. అబద్ధాలు ఒక రోజు ట్రెండ్ కావచ్చు. కానీ న్యాయ పరీక్షలో నిజమే గెలుస్తుంది. సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేశారు.
News February 20, 2026
రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.
News February 20, 2026
వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ తెలిపారు. బాన్సువాడ(2), ఎల్లారెడ్డి(3), మద్నూర్(1), పిట్లం(1) కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26వ తేదీన తమ అసలు ధ్రువపత్రాలతో కలెక్టరేట్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.


