News March 11, 2025

సంగారెడ్డి: ఈనెల 15న తల్లిదండ్రుల సమావేశం: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 15న తల్లిదండ్రుల (పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

Similar News

News January 3, 2026

బాయ్‌ఫ్రెండ్‌ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి..

image

ముంబైలో బాయ్‌ఫ్రెండ్‌ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణంగా దాడి చేసిందో మహిళ. శాంటాక్రూజ్‌లో ఉండే మహిళ(25), బాధితుడు(42) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు అడిగినా అతడు నిరాకరించాడు. దీంతో న్యూఇయర్ వేడుకలని అతడిని ఇంటికి ఆహ్వానించింది. పదునైన కత్తితో మర్మాంగాలపై అటాక్ చేసింది. బాధితుడు పారిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె పరారీలో ఉంది.

News January 3, 2026

కేయూ ఇయర్ వైస్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు శుభవార్త

image

కాకతీయ విశ్వవిద్యాలయం ఇయర్ వైస్ విద్యార్థులకు బ్యాక్ లాగ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తూ విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ వెంకయ్య నోటిఫికేషన్ జారీ చేశారు. బీఏ, బీఎస్సీ ,బీకాం, బీబీఎం, బీసీఏ( నాన్ ప్రొఫెషనల్) ఏడాది బ్యాక్ లాగ్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 31 లోపు ఒక్కో పేపర్‌కు రూ.4 వేల చొప్పున కళాశాలల ద్వారా వర్సిటీ పరీక్షల విభాగంలో చెల్లించాలని తెలిపారు.

News January 3, 2026

సభా సమరం.. కృష్ణా జలాలపై ఇవాళ చర్చ!

image

TG: కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో ఇవాళ షార్ట్ డిస్కషన్ జరగనుంది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ 12PMకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 4 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది.