News March 16, 2025
సంగారెడ్డి: ఈనెల 17న ప్రజావాణి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 17న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ రేట్లు కాస్త పెరిగాయి. హైదరాబాద్ నగరంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ గత వారం రూ.160-180గా ఉండగా ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.160గా ఉంది. అటు ఏపీలోని కర్నూలులో రూ.180, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, పిఠాపురంలో రూ.220కి విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 16, 2025
GNT: మేయర్ ఆకస్మిక నిర్ణయంపై వైసీపీలో అసంతృప్తి

మేయర్ మనోహర్ రాజీనామా నిర్ణయంపై వైసీపీలో కూడా కొంత అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం. వైసీపీకి ఉన్న 23 మంది కార్పొరేటర్లతో ఆయన మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా నగర అధ్యక్షులకు కూడా సమాచారం ఇవ్వలేదని సమాచారం. టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో తదుపరి చర్యలపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
News March 16, 2025
ఏలూరు జిల్లాలో దారుణం

బాలుడిని చైన్లతో కట్టేసి బంధించిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బాధితుడి తండ్రి వివరాల మేరకు.. నిడమర్రు మండలం ఉప్పరగూడేనికి చెందిన బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. కొల్లేరులో గొర్రెలు కాస్తున్న తండ్రి వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో జిరాయితీ భూముల్లో బాలుడు చేపలు పట్టాడంటూ వెంకన్న, పండు అనే వ్యక్తులు బాలుడిని గ్రామంలోకి తీసుకెళ్లి కుక్కల గొలుసుతో కట్టేశారు. తర్వాత మందలించి బాలుడిని వదిలేశారు.